Saturday, 11 April 2026 05:13:50 PM

భీమునిపట్నంలో పోషణ పక్వాడ కార్యక్రమాలు ప్రారంభం

Date : 09 April 2026 05:53 PM Views : 72

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 9: భీమునిపట్నం ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఏప్రిల్ 9 నుండి 23 వరకు 8వ పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల వద్ద తల్లి-శిశు పోషణ, చిన్నారుల మేధా వికాసం, జంక్ ఫుడ్ దుష్ప్రభావాలు, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భీమునిపట్నం అర్బన్ హెల్త్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డా. కళ్యాణ్ చక్రవర్తి, సూపర్వైజర్ బి. నాగమణి, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :