Wednesday, 05 August 2026 11:05:21 AM

భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన DCHS డా. నరేంద్ర సింగ్

Date : 25 February 2026 06:32 PM Views : 228

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 25 : నూతనంగా నియమితులైన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS) డా. నరేంద్ర సింగ్ భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన సేవలు అందించి కాన్పుల సంఖ్య పెంచాలని, అలాగే సాధారణ శస్త్రచికిత్సలను మరింతగా నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అదనంగా FRS హాజరు మరియు ABDM అమలు విషయాలపై కూడా సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :