Saturday, 11 April 2026 05:13:41 PM

ఇంటిపన్ను లేదు... ఇళ్లు ఉన్నా గుర్తింపు లేదు!

Date : 08 April 2026 02:16 PM Views : 46

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 8: తాళ్ళవలస పంచాయితీలో పెద్దూరు పాకల వద్ద నివసిస్తున్న 25 కుటుంబాలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నంబర్ 117/2లో గత ఐదు సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు ఇంటిపన్ను వేయలేదని వారు వాపోతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారికి గడపగడప కార్యక్రమంలో కూడా తెలియజేసినట్లు తెలిపారు. ఇక ఇదే పంచాయితీలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి సుమారు 68 ఇళ్లను నిర్మించిన వారికి మాత్రం ఇంటిపన్ను వేయడంతో పాటు అధికారుల ద్వారా స్థలాలు కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాకు కూడా ఇంటిపన్ను వేయాలని లేదా 80 సెంట్ల భూమిని కేటాయించాలని 25 కుటుంబాలు డిమాండ్ చేస్తూ.. భీమిలి MROకి వినతిపత్రం అందించారు.తమకు న్యాయం జరగకుంటే.. జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :