Wednesday, 05 August 2026 08:48:40 AM

మానవత్వం చాటుకున్న మా.. మంచి మాష్టారు

Date : 12 September 2024 06:02 PM Views : 919

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : సెప్టెంబరు 12 సాక్ష్యం న్యూస్: వరద బాధితుల సహాయార్థం భీమిలికి చెందిన ప్రముఖ విశ్రాంత ఉపాధ్యాయులు ఎం. వి. ఎల్. కామేశ్వరరావు మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల రూపాయలు విరాళంగా అందించారు. కోవిడ్ సమయంలో కూడా ఈయన లక్ష రూపాయలు ప్రధానమంత్రి సహాయనిధికి విరాళమిచ్చారు. ఏ సమయంలో అయినా..అవసరం నిమిత్తం ఎవరు వచ్చినా..నేనున్నానంటూ ముందడుగు వేస్తారు. మన హిందీ మాష్టారు. ఇప్పటికీ..ఎప్పటికీ.. ఎవరి నుంచి ఏదీ ఆశించని కామేశ్వరరావు మాష్టారు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయమందించడం అలవాటుగా చేసుకున్నారు. పలువురికి ఆదర్శప్రాయాలుగా నిలిచారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :