Sunday, 27 September 2026 05:12:30 PM

పోతూనురు గ్రామంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం

Date : 26 September 2024 09:05 PM Views : 586

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : సెప్టెంబరు 25 సాక్ష్యం న్యూస్: రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం అవలంబించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ బుధవారం ఉదయం దెందులూరు మండలం పోతునూరు గ్రామంలోని స్వరాజ్ భవన్ లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఫించన్లు పంపిణీని ఎంతో సమర్థవంతంగా జరుగుతున్నాయని, మొదటి రోజే దాదాపు 99.5% పంపిణీ చేయటం జరుగుతుందని వివరించారు. జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలో సమర్థవంతమైన టీం ఉండటం వల్ల సాధ్యమైందని అన్నారు. శానిటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉంటున్నామన్నారు. పంట తదితర నష్టాలకు సంబంధించి ప్రభుత్వం అందించే పరిహారం బాధితుల ఖాతాలోకి త్వరలోనే జమ అవుతుందని పేర్కొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: