Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 15 సాక్ష్యం న్యూస్ ,కొలిచే వారి కొంగుబంగారమై, భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా,గాలాయ గూడెం గ్రామ దేవతగా కొలువుదీరిన శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లిని తమ కుటుంబానికి ఇలవేల్పు అని స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు గంటా కోటేశ్వరరావు ,అచ్చమ్మ దంపతులు అన్నారు. మంగళవారం గాలాయగూడెం అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయంలో దంపతులు ఇరువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రూ.50 లక్షలతో కళ్యాణ మండపం, ఆలయ మార్గంలో తారు రోడ్డు నిర్మించామని గుర్తుచేసారు. గతంలో భక్తులు ఆలయానికి చేరుకోడానికి ఇబ్బందులు పడేవారని, ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కార్లు ,ఆటోలు, ట్రాక్టర్లతో నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్ళవచ్చని వివరించారు.
ఆలయానికి చేరుకునేందుకు రహదారి
Reporter
Neti Sakshyam