Monday, 28 September 2026 07:13:21 PM

బి.జే.పి సభ్యత్వ నమోదుపై భీమిలిలో అవగాహన సదస్సు

Date : 01 September 2024 07:47 PM Views : 586

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని బిజేపి రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్ అన్నారు.భీమిలి నియోజకవర్గ కన్వీనర్ కంటుభుక్త రామానాయుడు అధ్యక్షతన భీమిలి చిన్నబజారులోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాలులో నిర్వహించిన సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం గ్రామీణ పాంతాల అభివృద్ధికి అందిస్తున్న తోడ్పాటు, మరియు రాష్ట్రానికి  అందించే సంక్షేమం, అభివృద్ధికి కేంద్రం అందించే వాటా, అంతేకాకుండా వ్యవసాయం, వ్యాపారం వంటి వాటికి సబ్సిడీలు, పాఠశాలలు, జాతీయ రహదారుల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళి బిజేపి ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త ఓ సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సెల్ జిల్లా కన్వీనర్ వాసుపల్లి శ్రీహరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రావు పట్నాయిక్, జిల్లా కార్యదర్శి బండారు అనిల్ కుమార్, ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చిరికి సత్యనారాయణ, మండల అద్యక్షులు అన్నదేవర సురేంద్రకుమార్, డీవిజన్ అధ్యక్షులు కంటుభుక్త సునీత, పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గోన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :