Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : ఆగష్టు 26 దెందులూరు సాక్ష్యం న్యూస్: సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించినందున, కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారని. పురాణాలు చెబుతుండగా కంసుడి చెరసాలలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడని, ఆరోజును పురస్కరించుకుని శ్రీకృష్ణాష్టమిని అంతా జరుపుకుంటారని పోతునూరు శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు తలారి రామకృష్ణ అన్నారు .
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిపించారు. శ్రీకృష్ణ కోలాటాలు, తీన్మార్ డిజె సౌండ్ ల మధ్య కేరింతలతో గ్రామంలోని వీధి వీధి భక్తుల దర్శనార్థం స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో నున్న లక్ష్మణ ,నాగనబోయిన ఉయ్యూరు, కోప్పుల చినబాబు,నున్న భవాని,బొమ్మన బోయిన బాలకృష్ణ,బుర్ల బసవయ్య, నాగన బోయిన ఏసుప్రభు, బాల శీను,లక్ష్మణ ,బోడాల శీను, ఏసుబాబు, జగదీష్, నాగన్న బోయిన సాంబశివరావు ,దోనేపూడి రాఘవులు,. బుర్ల ఏసుబాబు,కొప్పుల కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam