Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : నవంబర్ 14 సాక్ష్యం న్యూస్ పోతునూరు లోని శ్రీ లీలా కృష్ణ రైస్ మిల్లుకు రైతుల నుంచి ధాన్యాన్ని ఇవ్వకుండా స్థానిక టిడిపి నాయకులు అడ్డుకుంటున్నారని పోతునూరు శ్రీ లీల కృష్ణ ట్రేడర్స్ రైస్ మిల్ యజమాని డిఎన్ వి ప్రసాద్ (బజ్జి )గురువారం పోతునూరు రైతు సేవ కేంద్రం ఎదుట నిరసన దీక్ష చేసారు. డి ఎన్ వి ప్రసాద్ రైతుసేవ కేంద్రానికి వెళ్లి తన మిల్లుకు రైతులు ఇష్టపూర్వకంగా తోలుతాము అని చెబుతున్నప్పటికీ ధాన్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ ,టెక్నికల్ అసిస్టెంట్ సమాధానం ఇస్తూ స్థానిక నాయకులు సూచన మేరకు తాము ఇలా చేయడం జరిగిందని చెప్పారు. 20 ఏళ్లుగా పార్టీలకతీతంగా రైతులు తన మిల్లుకే ధాన్యం అమ్ముతున్నారని ఎన్నడూ లేని విధంగా ఈసారి స్థానిక టిడిపి నాయకులు రైతుల ధాన్యాన్ని అడ్డుకోవడం బాధాకరమని వెంటనే రైతు సేవ కేంద్రం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎందుకు దీక్ష చేస్తున్నారని ప్రశ్నించడంతో విషయాన్ని ఎస్ఐకి వివరించారు .ఎస్సై శివాజీ రైతు సేవ కేంద్రం సిబ్బందిని మిల్లు అనుమతి లైసెన్స్ ఇతర విషయాలపై అడిగి తెలుసుకున్నారు. సమాచారాన్ని జిల్లా అధికారులకు వివరించారు.. పోతునూరు గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో వైఎస్ఆర్సిపి అని చెప్పి టిడిపి నాయకులు అడ్డుకోవడం సరికాదని గత 30 ఏళ్లుగా ఈ మిల్లుకే రైతులు అమ్ముతున్నారని ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు అన్నారు. ఈ విధానం సరైనది కాదన్నారు. దీక్షలో మద్దతుగా డివి ఆర్ కే చౌదరి, బట్రాజు సత్యనారాయణ ,చలసాని రామ్మోహన్రావు ,లింగాల కిరణ్, డొమినిక్, దారం తంబి, పెద్దిరాజు , మేరుగు వీరయ్య ,నాగనబోయిన నాగరాజు ,ఏసుబాబు ఉన్నారు.
Reporter
Neti Sakshyam