Sunday, 27 September 2026 05:52:02 PM

పద్మనాభంలో మన ఇల్లు, మనగౌరవం కార్యక్రమం

Date : 28 September 2024 05:42 PM Views : 671

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 28 సాక్ష్యం న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పద్మనాభం మండలంలో పలు గ్రామలలో శనివారం మండల ప్రత్యేక అధికారిణి సునీత, ఎంపిడిఒ విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన మన ఇల్లు,మన గౌరవం అనే అవగాహన కార్యక్రమానికి లబ్దిదారుల నుండి విశేష స్పందన లభించింది. రెడ్డిపల్లి, తునివలస గ్రామాలలో జరిగిన ఈ కార్యక్రమాంలో అధికారులు మాట్లాడుతూ.. అసంపూర్తిగా నిలిచిపోయిన కాలనీలను పూర్తి చేసుకోవాలని సూచించారు. లేని ఎడల కాలనీ రద్దవుతుందని గుర్తుచేసారు. నిర్మాణంలో ఉన్న కాలనీ ఇళ్ళకు కూడా బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొన్నారు. మొత్తం మండలంలో 22 పంచాయితీలలో ఈ అవగాహన సదస్సులు నిర్వహించి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :