Friday, 12 June 2026 03:16:58 AM

మద్దిలో సి సి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

Date : 19 October 2024 08:11 PM Views : 1037

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 19 సాక్ష్యం న్యూస్: మండలంలోని మద్దిగ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న సి సి రోడ్డు నిర్మాణానికి గురువారం గ్రామ సర్పంచ్ బుగత సన్యాసమ్మ శంఖుస్థాపన చేసారు.11లక్షలు ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులు, 3. 75 లక్షలు పంచాయతీ నిధులుతో సి.సి.రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచి సన్యాసమ్మ తెలిపారు.వీటి కోసం గతంలోనే పలు వీధులను గుర్తించినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బుగత శ్రీను, నాయకులు సత్యనారాయణ, నగేష్, నారాయణరావు, గిరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :