Wednesday, 05 August 2026 08:50:06 AM

విశాఖ AU అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి.// Mp. శ్రీభరత్.

Date : 01 August 2024 06:12 PM Views : 380

Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : విశాఖపట్నం AUతోపాటు ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని,కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని,విశాఖ Mp శ్రీభరత్ లోక్ సభ లో ప్రస్తావించారు. కేంద్ర నుండి ఇప్పటికీ విడుదలవ్వని మొదటి దశ రూ.150 కోట్లు పెండింగ్ లో ఉండగా, రెండవ దశకు అదనంగా రూ.400 కోట్లు కావాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ లోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నిధుల అవసరాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రాంతీయ మరియు గిరిజన విద్యలో కీలక పాత్ర పోషించబోతున్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మరియు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రస్తుత సవాళ్లను అధిగమించడానికి మరియు వాటి లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రత్యేక దృష్టిని చూపెట్టాలి అని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రెల్లి గ్రామం, విశాఖపట్నానికి సమీపంగా ఉన్నందువల్ల విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లు మరియు ఫ్యాకల్టీ నియామకానికి మెరుగైన అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలు ఉండేవి అని ఆయన పేర్కొన్నారు.. .

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: