Friday, 12 June 2026 03:12:23 AM

ఆగస్టు 14న జెండా ఉంచా రహేహమారాను జయప్రదం చేద్దాం

Date : 13 August 2024 08:36 AM Views : 390

Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : ఆగస్టు 13 విశాఖ సిటీ: విద్యార్థుల్లో దేశ భక్తిని, జాతీయ సమైఖ్యతను, పెంపొందించడమే లక్ష్యంగా జండా ఉంచా రహేహమారా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేటి బసవ కృష్ణమూర్తి అన్నారు. విశాఖ డాబా గార్డెన్స్ VJF ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు14న విశాఖలో సుమారు పది వేల మంది విద్యార్ధిని, విద్యార్దులతో 25వేల చదరపు అడుగుల త్రివర్ణ పతాకా ప్రదర్శన చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వేదికగా ప్రారంభం కానుందని వివరించారు. ఈ బృహత్తరమైన కార్యక్రమంలో కేవలం యువత, విద్యార్థులతో పాటు ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 2వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల వేదికగా జెండా ఉంచా రహే హమారా కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించామని, ఆగస్టు 31న పాడేరులో ముగింపు కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీజేఎఫ్ మాజీ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ క్రియాశీలక కార్యవర్గ సభ్యులు గొల్ల ప్రదీప్ రాజు, కర్త నరేష్, ఇపాకి మొహమ్మదీ, కొయ్య రామకృష్ణ, దీనికి కుమార్, శివ దలై, తమ్మన విజయ్, శ్రీకాంత్, రామాయణం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :