Monday, 28 September 2026 06:57:36 PM

పింఛన్లు ఇంటింటా పంపిణీ చేసిన కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

Date : 31 August 2024 10:00 PM Views : 575

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : వేములవలస గ్రామ పంచాయతీలో వేకువ జామున నుంచే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. వేములవలస గ్రామానికి చెందిన కిడ్డి వ్యాధిగ్రస్తుడు బోనీల ఈశ్వరరావు ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటూ ఇంటికే పరిమితమైయ్యాడు. అతనికి కూటమి ప్రభుత్వ సహాయంతో పదివేల నగదు పింఛనుగా బాధితుడైన ఈశ్వరరావుకి జ్ఞానేశ్వర్ చేతులమీదుగా అందజేశారు. మందులు, మరియు వైద్య ఖర్చులకు వినియోగించుకుని పూర్తి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులకు పించన్లు అందుకున్న లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :