Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : ఆగస్టు 17 సాక్ష్యం: భర్తను కోల్పోయి ఇద్దరు ఆడపిల్లలతో కాయకష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భీమునిపట్నం కృష్ణాకోలనీకి చెందిన కరుభుక్త జయమ్మ పెద్దమ్మాయికి వివాహం జరిపించారు. ఇక కూతురు అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటుండగా..ఆయింటికి పెద్ద దిక్కుగా ఉండే వారి తల్లి జయమ్మ కూడా అకస్మాత్తుగా మరణించడంతో ఆ చిన్న కుమార్తె అనారోగ్యంతో ఒంటరైంది. దీంతో భీమిలి జమ్మి చెరువు పార్క్ వాకర్స్ సభ్యులు "యువ భారత్" భీమిలి శాఖ వారి ఆధ్వర్యంలో కరుభుక్త కనక కు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను మరియు కొంత నగదును సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ దాతలు శేషాద్రి, గాడు సన్యాసి నాయుడు, సంకురుభుక్త జోగారావు హేమంత్ శేఖర్, కాళ్ళ రమణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam