Tuesday, 04 August 2026 07:22:38 AM

పూర్వ విద్యార్దుల కలయికతో సందడిగా మారిన భీమిలి ప్రభుత్వ పాఠశాల.

Date : 25 August 2024 06:39 PM Views : 880

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : ఆగస్టు 25 భీమిలి సాక్ష్యం న్యూస్: పూర్వ విద్యార్ధిని, విద్యార్థుల ఆత్మీయ కలయికతో భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. 1976 నుంచి 79 వరకు 8,9,10 తరగతులకు చెందిన విద్యార్థులంతా అదే పాఠశాల వేదికగా అంతా ఏకమవ్వగా.. అలనాటి మదుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని ఆప్యాయంగా పలుకరిస్తూ..ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వీరిలో ఒకరైన కె.సన్యాసినాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. భీమిలికి చెందిన కళాసాహితి అధ్యక్షులు పి.ఆర్.పి.వర్మ, న్యాయవాది చిన్నయ్యపాత్రుడు..కలిగొట్ల భానోజీ రావు. కందుకూరి బుచ్చిబాబు, చందక అప్పలరెడ్డి, సూరిబాబు, శేషగిరి, కశింకోట ఎం.పి.డిఓ రవికుమార్, చోడవరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేఖ రామారావు తదితరులు పూర్వ విద్యార్థులుగా ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు వర్మ వ్రాసిన భీమిలి చారిత్రక కధలు గురించి పలువురు వేదికపై ప్రశంసించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు హైస్కూల్ కి సౌండ్ సిస్టం బహూకరించడం తోపాటు వీరితో చదువుకున్న ముగ్గురికి ఐదువేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆడుతూ..పాడుతూ.. సరదాగా సాగిన పూర్వ విద్యార్థుల కలయిక పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సరదాగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వందేళ్ల హైస్కూల్ ఉత్సవాల కమిటీ కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.రమణ తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: