Wednesday, 05 August 2026 08:48:49 AM

పాఠశాలల బస్సుల ప్రమాదాలను నివారించాలి. // ఎంపీపీ కె.రాంబాబు//

Date : 14 August 2024 07:34 PM Views : 453

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : ఆగస్టు 14 పద్మనాభం సాక్ష్యం ప్రథినిధి: మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రైవేటు పాఠశాలలకి చెందిన బస్సుల ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీపీ కె.రాంబాబు మండల విద్యాశాఖ అధికారి బాబూలాల్ కు ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ లో ఎంఈఓతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో Mpp మాట్లాడుతూ సుమారు ఐదు సంవత్సరాల క్రితం, ఇటీవల జరిగిన ప్రైవేటు పాఠశాల బస్సుల ప్రమాదంలో యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం జరిగిందని గుర్తు చేశారు. బస్సులకు క్లీనరలు లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే నిర్ణయించిన బస్సు ఫీజులు విద్యార్దుల నుంచి వసూలు చేసినప్పటికీ...పిల్లలకు కూర్చునే సౌకర్యం కల్పించకపోవడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ నిభందనలను యాజమాన్యాలు ఆయా పాఠశాలలో అమలు చేయలేదని మండిపడ్డారు. నిభందనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: