Tuesday, 04 August 2026 07:23:23 AM

చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఇద్దాం.

Date : 07 August 2024 08:06 PM Views : 542

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : సాక్ష్యం డెస్క్: చేనేత వస్త్రాలను చేనేత కార్మికులను ప్రోత్సహించి దేశీయ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని..భీమునిపట్నం ఎస్ వి ఎల్ ఎన్ ఎస్ ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ విష్ణుమూర్తి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించే భాద్యత భారతీయుల మైన మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్దినీ, విద్యార్థులు చేనేత వస్త్రధారణతో ఆహుతులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్, బోధన సిబ్బంది,బోధ నేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: