Friday, 12 June 2026 03:15:33 AM

చిట్టివలస జ్యూట్ కార్మిక సంఘాలు త్వరలో చలో ఢిల్లీ.

Date : 22 August 2024 10:43 AM Views : 499

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ తగరపువలస : ఆగష్టు 21 తగరపువలస సాక్ష్యం న్యూస్: చిట్టివలస జూట్ కార్మికుల పెండింగ్ బకాయిలు యాజమాన్యం వెంటనే చెల్లించాలంటూ..త్వరలోనే ఛలో డిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా చిట్టివలస జ్యూట్ యాజమాన్యం కార్మికులకు ఒప్పందం ప్రకారం ఇoతవరకు పెండింగ్ బకాయిలను చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొంతమంది కార్మికులు మారు పేర్లతో పని చేశారని, ఆ విషయం అందరికీ తెలిసిందేన‌ని గుర్తుచేసారు. మారుపేరుతో ఉన్న కార్మికులకు PF లు మరియు పెన్షన్లు ఇప్పటికీ అందడం లేదని, అందువలనే సెంట్రల్ లో BJP పెద్దలను కలిసి మారు పేర్లుతో ఉన్న కార్మికుల సమస్యల గురించి మాట్లాడేoదుకు త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. చిట్టివలస జ్యూట్ మిల్ కాంగ్రెస్ కార్మిక సంఘం అధ్యక్షులు J V కైలాస్ రెడ్డి ఆర్థిక సహాయంతో కార్మిక సంఘం నాయకులు డిల్లీ ప్రయాణానికి త్వరలో ముహూర్తం ఖరారు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు J V కైలాష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ దల్లి అప్పలరెడ్డి, జనరల్ సెక్రటరీ M ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :