Monday, 28 September 2026 07:13:32 PM

ఇకపై మతపరమైన బోధనలు ఉండవు.//స్ర్పింగ్ ఫీల్డు పాఠశాల యాజమాన్యం వెల్లడి

Date : 01 August 2024 08:16 PM Views : 517

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : తమ పాఠశాలలో ఇకపై విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారుల సూచనల మేరకు ఎలాంటి మతపరమైన బోధనలు ఉండబోవని స్ర్పింగ్ ఫీల్డు పాఠశాల పాఠశాల కరస్పాండెంటు అలీవర్ రాయ్ అన్నారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాలలో విద్యార్ధులకు చేస్తున్న ఏసుక్రీస్తు గురించి చేసిన భోదనలపై ఇటీవల పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారని, అలాగే దీనిపై జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు పరిశీలన చేసారని తెలిపారు. తాము అధికారులు సూచినలను, పెట్టిన నియమ నిబంధనలను పాఠశాల తప్పకుండా పాటిస్తుందని స్పష్టం చేశారు. ఎటువంటి అపోహాలు,అనుమానాలు ఉన్నా..వాటిని నివృత్తి చేసుకునేందుకు ఈ నెల 3న మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో తమ పాఠశాలలో నిర్వహించే కార్యక్రమానికి హాజరై తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆలీవర్ రాయ్ కోరారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :