Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : కందిరీగల దాడికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పద్మనాభం మండలం కోరాడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కోరాడ గ్రామానికి చెందిన రైతు మీసాల జగన్నాధరావు (47) ఈనెల 17 న తన పొలంలో పని చేసుకుంటున్న నేపథ్యంలో తాటి పెండ్ల మద్య నుంచి ఒక్కసారిగా కందిరీగలు మృతుడు జగన్నాధరావుపై దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన అతనిని బంధువుల సహాయంతో విజయనగరం మహరాజ ఆస్పత్రిలో చేర్చారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన జగన్నాధరావు గురువారం చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందంని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Reporter
Neti Sakshyam