Sunday, 27 September 2026 05:49:55 PM

ఉండ్రాజవరంలో ఇది "మంచి ప్రభుత్వం "కార్యక్రమం

Date : 23 September 2024 08:55 PM Views : 576

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : > సాక్ష్యం టెలివిజన్ సామాన్యడి పక్షం: ఉండ్రాజవరంలో ఇది "మంచి ప్రభుత్వం "కార్యక్రమం సంక్షోభంలో కూడా సంక్షేమం సాధించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ యువ నేత ఉండ్రాజవరం గ్రామ బూత్ ఇంచార్జ్ బాయి రాంప్రసాద్ అన్నారు. సోమవారం దెందులూరు మండలం ఉండ్రాజవరం గ్రామంలో టిడిపి సీనియర్ నేత సున్నా రాంబాబు, గ్రామ యువనేత ఎన్నింటి పండు, గ్రామ స్థాయి కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మద్దుల నాగు, గరక సుధాకర్, కనకల సూర్యచంద్రరావు (బుజ్జి), గరక గంగాధర్ రావు, అనకాపల్లి శివ, డొకర రాము, కనకల దశమంతు, మద్దుల రాంప్రసాద్, కాళ్ల చింటూ, కనకల హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: