Monday, 28 September 2026 05:13:37 PM

శేరీఖండంలో బారీ అన్నదానం.తరలివచ్చిన భక్తజనం.

Date : 12 September 2024 05:10 PM Views : 1000

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 12 సాక్ష్యం న్యూస్: మండలంలో శేరీఖండం గ్రామంలో పెద్ద వంతెన వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద వినాయక నవరాత్రుల సందర్భంగా గురువారం రెడ్డపల్లివారు, సిద్దివినాయక యూత్ ఆధ్వర్యంలో బారీగా అన్నసమారాదన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా సుమారు నాలుగు వేల మంది కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ చిన్నారావు, గ్రామ పెద్దలు అప్పలకృష్ణ చేతులమీదుగా భక్తులకు వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంబించారు. అంతకుముందు స్వామి వారికి గ్రామ సర్పంచ్ చిన్నారావు, అప్పలక్రిష్ణ ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో సత్తబాబు,నాగేంద్ర,బాలజీ, ఎస్.శ్రీను, బి.అప్పలరాజు, ఆర్ అప్పలరాజు, సురేష్ పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :