Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : ఆనందపురం సాక్ష్యం ప్రతినిధి: మండలంలోని బంటుపల్లి కల్లాలు వద్ద జిల్లా పశుగణాభివృద్ధి సంఘం మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గర్భ కోసం వ్యాధుల నివారణకు మెగా చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ ఈ శిభిరానికి సుమారు*45* మంది రైతులు తమ పశువులను తీసుకుని వచ్చి ఆయా వ్యాధులకు చికిత్స చేయించుకున్నారు. వీటిలో 30 లేగ దూడలకు నట్టల నివారణకు మందులు ఇవ్వగా 75% రాయితీతో పశుగ్రాస విత్తనాలు కూడా అందించారు.
అంతే కాకుండా 90% రాయితీతో మినీ గోకులం షెడ్లు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పాడి రైతులు వాటిని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.అనిల్ కుమార్ ఆనందపురం సి ఎ డి డి ఎల్ ల్యాబ్ టెక్నీషియన్ పశువైద్య సహాయకులు ఆఫీస్ సబార్డినేట్, జేడీ. రామకృష్ణ, మరియు రైతులు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam