Sunday, 27 September 2026 05:15:37 PM

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం.

Date : 05 October 2024 05:19 PM Views : 576

Neti Sakshyam - వార్తలు / ఏలూరు : అక్టోబరు 5 సాక్ష్యం న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికొస్తే ఏ ప్రభుత్వానికైనా అవి ఆఖరి రోజులే అని భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏలూరు టౌన్ అధ్యక్షులు కాకర్ల శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,బిజెపి నాయకులు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయుమని ఉద్యోగుల భద్రత తొలి ప్రాధాన్యత అని కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారన్నారు.తీరా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. స్టీల్ ప్లాంట్ జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా భవిష్యత్తులో గుర్తుండిపోయేలా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :