Friday, 12 June 2026 04:33:23 AM

చల్లచింతలపుడి శ్రీ పాటిమ్మ తల్లికి పుట్టింటి చీర, సారే

Date : 01 August 2024 07:33 PM Views : 414

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : ఏలురు జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెం,చల్లచింతలపూడి తిమ్మనగూడెం శివారుల్లో వెలసిన యలమర్తి వారి ఆడపడుచు శ్రీ పాటమ్మ తల్లి అమ్మవారికి భక్తులు ఆషాడం మాసం చీర, సారే, పసుపు ,కుంకుమలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ,సంతాన లక్ష్మిగా పేరుపొందిన యలమర్తి వారి ఆడపడుచు శ్రీ పాటిమ్మ తల్లికి మంగళవారం అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ యలమర్తి హేమ శ్రీనివాసరావు,హేమలత, యలమర్తి మోహన మురళీకృష్ణ యలమర్తి బొర్రయ్య, రాంబాబు, రామయ్య ఆధ్వర్యంలో పెరుగుగూడెం గ్రామం నుండి 118 మంది ముత్తైదువులతో అమ్మవారికి పుట్టింటి సారే ,పసుపు ,కుంకుమ బోనాలను మేళ తాళాలతో ఊరేగింపుగా చల్ల చింతలపూడి గ్రామం మీదుగా పోలవరం కాలువ గట్టుకు చేరుకుని పాటమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దంపతులు శ్రీనివాసరావు హేమలతలు అమ్మవారిని దర్శించుకున్నారు. . ఈ కార్యక్రమంలో పెరుగు గూడెం గ్రామం తో పాటు చల్ల చింతలపూడి గ్రామ మాజీ సర్పంచ్ ముమ్మడి మోహనరావు,మాజీ వైస్ ఎంపీపీ నాగనబోయిన సత్యనారాయణ, పెరుగు గూడెం గ్రామ టిడిపి అధ్యక్షులు పావులూరు దశరధరామయ్యతో పాటు బంధువులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :