Friday, 12 June 2026 01:49:31 AM

భార్యను హత మార్చిన భర్త. పద్మనాభంలో అమానుషం.

Date : 31 August 2024 07:37 AM Views : 2191

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : ఆగష్టు 31 పద్మనాభం సాక్ష్యం న్యూస్: భార్యపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా పద్మనాభంలో చోటు చేసుకుంది. స్థానికులు, మృతురాలి బందువులు తెలిపిన వివరాల ప్రకారం భూలోకం (35) వెంకటలక్ష్మి (32) లకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి అఖిల్(4) అక్షిత్ (2) ఇద్దరు సంతానం. మృతురాలి అత్తమామలతో వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన వీరు పద్మనాభం గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మృతురాలి భర్త భూలోకం ట్రాక్టరు డ్రైవరుగా పని చేస్తూ ..తాగుడుకు బానిసయ్యాడు.

ఈ నేపథ్యంలో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందంటూ..చీటికి మాటికి వేధించడంతో.. భార్య వెంకటలక్ష్మి భర్తకు దూరంగా ఉంటూ అదే గ్రామంలో పిల్లలతో కలసి వేరేగా ఉంటోంది. శుక్రవారం రాత్రి వెంకటలక్ష్మి దగ్గరకు వెళ్ళిన భూలోకం మాటిమాటికీ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ భార్యతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో వారిద్దరి మద్య మాటా మాటా పెరగడంతో ఆమెను పిక నులిమి ప్రాణాలు తీసి, కత్తితో తనకు తాను గాయ పరుచుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పద్మనాభం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు భూలోకం ప్రస్తుతం విశాఖ కే.జి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :