Monday, 28 September 2026 10:22:06 PM

వరినాట్లుకు ఆటంకం లేకుండా ట్రాన్సుఫార్మరు ఏర్పాటు

Date : 14 August 2024 07:33 PM Views : 517

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : ఆగస్టు 14 పద్మనాభం సాక్ష్యం ప్రథినిధి: పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలో ప్రస్తుతం వేస్తున్న వరి ఉడుపులకి ఆటంకం లేకుండా మంగళవారం మండల విద్యుత్ ఏ.ఈ.రమేష్ ట్రాన్సుఫార్మరును ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా గ్రామంలోని గులమజ్జివారి కళ్లాలలో సుమారు ఇరవై మంది రైతులు ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. కాగా ఇక్కడి విద్యుత్ ట్రాన్సుఫార్మరు ఇటీవల మరమ్మత్తులకు గురైంది. దీంతో రైతులు ఫిర్యాదు మేరకు ఏ.ఈ. స్పందించి విద్యుత్ ట్రాన్సుఫార్మరును ఏర్పాటు చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :