Tuesday, 04 August 2026 07:21:57 AM

కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేస్తేనే గుర్తింపు.

Date : 04 September 2024 10:55 AM Views : 585

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 3 సాక్ష్యం న్యూస్: ప్రతి ఉద్యోగి ఇష్టంతో పనిచెస్తేనే ఆ శాఖలో గుర్తింపు గౌరవం ఉంటుందని ఆర్.జె.డి.బి.విజయభాస్కర్ అన్నారు. రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు వి.చిరంజీవిరావు సన్మాన సభకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్ళూ.. తన వృత్తి ధర్మాన్ని చాలా ఇష్టంగా నిర్వర్తించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని చిరంజీవిరావుపై ప్రసంశల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ కె.రాంబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎస్.గిరిబాబు,మండల వైసీపీ అధ్యక్షుడు కె.లక్ష్మణరావు చిరంజీవిరావు దంపతులను దుశ్శాలువలు,పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అలాగే ఎం.ఎల్.సి.వర్మ, విజయనగరం డిఈఒ ప్రేమకుమార్ మరియు తోటి ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :