Monday, 28 September 2026 05:14:05 PM

సమిష్టి కృషితోనే సత్ఫలితాలు.

Date : 25 August 2024 06:58 PM Views : 951

Neti Sakshyam - వార్తలు / ఏలూరు : ఆగస్టు 25 ఏలూరు సాక్ష్యం న్యూస్: సమిష్టి కృషితోనే సత్ఫలితాలు లభిస్తాయని ఏలూరుపీఠం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమ్మానుయేలు సెయింట్ జాన్స్ విద్యాసంస్థల వ్యవస్థాపక కరస్పాండెంట్ ఫాదర్ జిజే చార్లెస్ అన్నారు .ఆదివారం సోమవారం సెయింట్ జాన్స్ విద్యాసంస్థల్లో అపూర్వ ఉపాధ్యాయుల సమ్మేళనం ఏలూరుపీఠం వికార్ జనరల్ డాక్టర్ పి బాల అధ్యక్షతన జరిగింది .ఫాదర్ బాల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో 25 ఏళ్ల కిందట దివంగత ఏలూరుపీఠం అధిపతి జాన్ ములగగాడ ఆశీస్సులతో ఫాదర్ జీజే చార్లెస్ ఉపాధ్యాయులు అందించిన సేవలు చేసిన కృషి తో ఎంతోమంది సెయింట్ జాన్స్ కళాశాల నుంచి డిఈడి, బిఈడి విద్యను అభ్యసించి నేడు ఉన్నత స్థితికి చేరుకున్నారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయులు అంతా ఈ రోజు సేవలందిస్తున్న అందించిన కళాశాలలో ఒక్కటి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో చనిపోయిన అధ్యాపకులు విద్యార్థుల కు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రత్యేక దివ్య పూజ బలి అర్పించారు. అనంతరం వ్యవస్థాపక కరస్పాండెంట్ ఫాదర్ చార్లెస్ ఉపాధ్యాయులను ఫాదర్ బాల ఇమ్మానుయేలు సత్కరించారు. ఫాదర్ ఇమ్మానియేల్ ను ఫాదర్ బాల ఉపాధ్యాయులు సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఫాదర్ జోజి రెడ్డి, జే యం జె హై స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సునీత, ఫాదర్ మైకేల్ ,కళాశాల అధ్యాపకులు, పూర్వ అధ్యాపకులు ఉన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: