Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : నేటి సాక్ష్యం: మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ అధ్వర్యంలో ఈనెల 2 న మెగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ మేనేజర్ వరద రవి కుమార్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యాంపస్ డ్రైవ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోవాన ఇంజనీరింగ్ & సర్వే సర్వీసు ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నిర్వహించే క్యాంపస్ డ్రైవ్ ను అర్హులైన నిరుద్యోగ విద్యార్ధిని, విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్ ద్వారా దాదాపు 100 మంది (ఫ్రెషర్స్/అనుభవజ్ఞులు)కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం సొల్యూషన్స్ హెచ్‌ఆర్ మేనేజర్ బి.రమ్య మాట్లాడుతూ "2023 - 2024 విద్యా సంవత్సరం నుంచి డిప్లొమా/బి.టెక్ (మెకానికల్ /సివిల్) విద్యార్థులు 60% మరియు ఆటోకాడ్‌లో మంచి నైపుణ్యం ఉన్నవారు డ్రైవ్‌కు అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆగస్ట్ 2న ద్వారకానగర్‌లోని వారి క్యాంపస్‌కి నేరుగా లేదా బయోడేటాలను hr@millenniumsoftsol.com కు పంపవచ్చని ఆమె తెలిపారు. ఈ డ్రైవ్‌కు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం www.millenniumsoftsol.com ని సందర్శించవచ్చు లేదా 92487 53098 నంబరుకి కాల్ చెయ్యచ్చు.
Reporter
Neti Sakshyam