Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 23 సాక్ష్యం న్యూస్ : మండలంలోని అయినాడ గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా వైసీపీ నాయకులు మాజీ భీమిలి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కోరాడ పాపారావు,మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి మామిడి శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని భారీగా భారీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సత్యనారాయణపురం, అయినాడ, ఏతపేట ,బొత్సపేట గ్రామాల నుండి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. మద్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం.ఆరంజ్యోతి, ఎంపిటీసీ ,మాజీ సర్పంచ్ కోరాడ రమేష్,తదితరులు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam