Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 10 పద్మనాభం సాక్ష్యం న్యూస్: మండలంలో కృష్ణాపురం కనకల వీధిలో వినాయక నవరాత్రుల సందర్భంగా స్ధానిక సిద్దివినాయక యూత్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఎంపీపీ కె.రాంబాబు చేతులమీదుగా ప్రారంభించారు.
అంతకుముందు ఆయనతో పాటు, నాయకులు గాడు అప్పలరాజు, బోలె అప్పలనాయుడు, సుంకర అచ్చంనాయుడు,మొకర చిన్నశ్రీను, కనకల పైడినాయుడు, స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా ఏళ్ళుగా ఈ అన్నదాన కార్యక్రమాలను భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ గుర్తుచేసారు.
Reporter
Neti Sakshyam