Sunday, 27 September 2026 05:52:31 PM

చిన్న పత్రికని.. విలేఖరిని చిన్న చూపు చూడొద్దు. // గంట్ల శ్రీనుబాబు//

Date : 03 August 2024 01:58 PM Views : 598

Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : విశాఖ సిటీ:గత వైసిపి ప్రభుత్వం చిన్న పత్రికల వైపు చిన్న చూపు చూడ్డమే కాకుండా వాటిని పూర్తిగా అణగద్రొక్కాలనే ఉద్దేశంతోనే అక్రిడేషన్లను కూడా త్రొక్కిపెట్టారని జర్నలిస్టుల సంఘ జాతీయ కార్యవర్గ సభ్యులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. విశాఖ కలక్టర్ కార్యాలయ ఆవరణలోని AP NGOs భవనంలో ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మరియు Ap బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోషియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వం జర్నలిస్టులకు విలువలు ఇవ్వకపోవడమే కాకుండా వారికి సంబంధించిన ఏ సంఘాలకూ ప్రాతినిధ్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు. జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఆశ చూపి కనీసం ఒక్క సెంటు కూడా ఇవ్వకపోగా..దరఖాస్తులకు,నోటరీలకు జర్నలిస్టులు జేబులు ఖాళీ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ పట్ల చొరవ చూపి అర్హులైన వారికి ఇళ్ళ స్థలాలు, అక్రిడేషన్లు ఇవ్వడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా తమ న్యాయమైన నిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. విశాఖ జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :