Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 9: భీమిలి మండలం తిమ్మాపురం గ్రామంలో నేషనల్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ అక్వాటిక్ యానిమల్ డిసీజెస్ (NSPAAD) బృందం ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. మత్స్యశాఖ ప్రిన్సిపల్ & అదనపు డైరెక్టర్ డా. ఎస్. అంజలి ఆదేశాల మేరకు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కె. శ్రావణి కుమారి పర్యవేక్షణలో, జాయింట్ డైరెక్టర్ పి. లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హ్యాచరీలను సందర్శించి నమూనాలు సేకరించారు. రొయ్యల సాగులో స్క్రీనింగ్ ప్రాముఖ్యత, వ్యాధుల ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన సీడ్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. హ్యాచరీ నిర్వహణ, నీటి నాణ్యత పరిరక్షణపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్. ఈశ్వర్ రాజు, యంగ్ ప్రొఫెషనల్ ఎన్.ఎన్. చైతన్య, జూనియర్ కన్సల్టెంట్ పి. శ్రీనివాసు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam