Tuesday, 04 August 2026 09:18:11 AM

వైభవంగా నవశక్తి దేవతల ఆలయాల పునః ప్రారంభం

Date : 20 February 2026 02:32 PM Views : 299

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 20 సాక్ష్యం షార్ట్ న్యూస్: భీమిలి నియోజకవర్గంలోని శ్రీ శ్రీ శ్రీ నవశక్తి దేవతల ఆలయముల సముదాయం పునఃప్రారంభ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. 4వ వార్డ్ కార్పొరేటర్ దవులపల్లి కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షుడు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరమ్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు ప్రజా ప్రతినిధులు, భక్తులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు మరియు సభ్యులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :