Wednesday, 05 August 2026 09:50:59 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 120 ఫిర్యాదులు

Date : 23 February 2026 09:38 PM Views : 198

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖపట్నం : ఫిబ్రవరి 23// విశాఖపట్నం: ప్రతీ సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి ఈ సోమవారం 120 ఫిర్యాదులు అందాయి. నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత భాగ్చి, ఐపీఎస్, తన కార్యాలయం నుండి ప్రత్యక్షంగా పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను స్వీకరించారు. నగర సబ్-డివిజన్ ఏసీపీలు, పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడిన సీపీ, వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల గొడవలు, మోసాలు మరియు సివిల్ కేసులకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :