Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : భీమిలి, మార్చి 16: భీమిలి గ్రామదేవత శ్రీ నూకాలమ్మ తల్లి వార్షిక ఉత్సవాలను ఈ నెల 17 నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మూడవ వార్డు కార్పొరేటర్ గంటా నూకరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించే అంశాలపై చర్చించారు. కార్యక్రమాలను ఎక్కడి నుండి ప్రారంభించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, కమిటీ సభ్యులు ఎవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి అనే అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో శిల్లా కరుణాకర్ రెడ్డి, మారోజు సత్యవరప్రసాదరావు, గాడు యశ్వంత్ కుమార్, ఉశిరికల బంగార్రాజు తదితర కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam