Sunday, 27 September 2026 04:19:06 PM

భీమిలి డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

Date : 28 February 2026 05:27 PM Views : 392

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 28: స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కళాశాల సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేఖ మాట్లాడుతూ సైన్స్ రంగంలో మహిళలు వికసిత్ భారత్‌కు ప్రేరణగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం, లింగ సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా దేశం సైన్స్ రంగంలో మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పవర్ పాయింట్ మరియు పోస్టర్ ప్రజెంటేషన్లు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన క్విజ్ పోటీల్లో మరియు పోస్టర్ ప్రజెంటేషన్‌లలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సైన్స్ అసోసియేషన్ కన్వీనర్ బి. ప్రసాద్ రావు, సభ్యులు డాక్టర్ కె.వి. విద్యాసాగర్, డాక్టర్ ఎస్. అప్పలనాయుడు, శ్రీ ఎస్. శ్రీను, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :