Friday, 12 June 2026 03:14:39 AM

కళ్యాణ వెంకన్న దర్శనానికి ఎమ్మెల్యే గంటా… ప్రత్యేక పూజలు

Date : 28 February 2026 06:30 PM Views : 237

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 28: భీమిలి కృష్ణా కాలనీ కొండపై సాగర తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం దర్శించుకున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం పర్యవేష్టం చుట్టి, మేళతాళాలతో ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ నాలుగో వార్షికోత్సవాల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గంటా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చిన్ని కుమారి లక్ష్మి, జడ్పీటీసీ వెంకటప్పడు, గొరపల్లి సన్యాసిరావు, గొలగాని నరేంద్ర, కంటుభుక్త రామానాయుడు, యశ్వంత్, పొట్నూరు రాము, గరికిన కింగ్ తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :