Friday, 12 June 2026 01:46:08 AM

టేకాఫ్ అయిన 10 నిమిషాలకే తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం

Date : 03 June 2026 04:41 PM Views : 16

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : జూన్ 3: విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన 10 నిమిషాలకే తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు బయలుదేరిన ఈ విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు భద్రతా చర్యల్లో భాగంగా తిరిగి ల్యాండ్ చేశారు. విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :