Sunday, 27 September 2026 05:02:08 PM

భీమునిపట్నం నూకాలమ్మ జాతరలో అకాల వర్షం. భక్తుల్లో నిరాశ.

Date : 20 March 2026 09:41 PM Views : 305

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 20: భీమునిపట్నం శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాల్లో చివరి రోజు జాతరలో పాల్గొన్న భక్తులకు వర్షం చినుకులు కాస్త నిరాశ మిగిల్చింది. సాయంత్రం వేళ చల్లని గాలులు ఆహ్లాదం కలిగించగా, వెంటనే ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు కాస్త ఆందోళన కలిగించాయి. దీంతో స్టేజ్ ప్రోగ్రాంలకు అంతరాయం కలిగింది. మరోవైపు బొమ్మల దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ స్టాళ్లు, చెరుకు గడలు విక్రేతలు అమ్మకాలు తగ్గడంతో నిరాశకు గురయ్యారు. వర్షం కారణంగా పలువురు భక్తులు మధ్యలోనే వెనుదిరిగారు.పిల్లలతో వచ్చిన కుటుంబాలు త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు తొందరపడగా, అర్ధరాత్రి వరకూ జరగాల్సిన జాతర సందడి ఒక్కసారిగా తగ్గిపోయింది.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: