Friday, 12 June 2026 01:46:07 AM

భీమిలిలో ఉచిత కంటి వైద్య శిభిరం

Date : 23 May 2026 05:53 PM Views : 143

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 23 :సామాన్య ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు కైతపల్లి శ్రీనివాస్ అన్నారు. భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్, సన్ స్కూల్, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భీమిలి సన్ స్కూల్‌ ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిభిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ అందించిన అనేక అనేక సేవాకార్యక్రమాలను గుర్తు చేశారు.ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 157 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, 37 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక అయ్యారని తెలిపారు. అలాగే కళ్లజోడు అవసరమైన 24 మంది పేద వృద్ధులకు త్వరలో ఉచిత కళ్లజోడ్లు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమీజ్, క్యాంప్ కోఆర్డినేటర్ పైడిరాజు, ముసునూరి సూర్య శ్రీనివాస్, బసవ కృష్ణమూర్తి, వెంపాడ శ్రీనివాసరెడ్డి, వాండ్రాసి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :