Friday, 12 June 2026 03:16:58 AM

లిటిల్ హగ్స్‌ కేంద్రానికి MFC స్పీకర్ బహుకరణ

Date : 27 March 2026 08:27 AM Views : 150

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : మార్చి 26: తగరపువలసకు చెందిన శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ అధినేతలు ఆదిమూలం నాగరాజు, సత్యనారాయణలు మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. భీమిలి పరిధి జి. తాళ్ళవలసలోని భరోసా లిటిల్ హగ్స్ బాలల సంరక్షణ కేంద్రానికి బ్లూటూత్ స్పీకర్‌ను బహుకరించారు. దీని ద్వారా ప్రతి రోజు ఉదయం భక్తి గీతాలు వినే పిల్లల్లో భక్తిభావం పెరుగుతుందని, ఆటల పోటీల్లో ప్రోత్సహించేందుకు, అలాగే.. చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశ్రమం నిర్వాహకులు వెంపాడ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు పిల్లలు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :