Tuesday, 04 August 2026 07:26:28 AM

భీమిలి CHCను సందర్శించిన DCHS డా. నరేంద్ర సింగ్

Date : 11 April 2026 01:30 PM Views : 208

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 10: భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)ను జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS) డా. నరేంద్ర సింగ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆయన పరిశీలించి, రోగుల సేవల మెరుగుదలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అమలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) హాజరు విధానం పై సమీక్ష నిర్వహించారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.అలాగే ఆసుపత్రి సిబ్బందితో సమావేశమై, సేవల నాణ్యత పెంపు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: