Sunday, 05 April 2026 06:54:20 PM

లింగ సమానత్వం పై అవగాహన

Date : 05 March 2026 06:30 PM Views : 172

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 6 : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా భీమునిపట్నం ఐకేపీ భవనంలో నాలుగో రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీవో శ్రీదేవి మహిళలను ఉద్దేశించి లింగ సమానత్వం ప్రాముఖ్యతను వివరించారు. మహిళలు విద్య, ఉపాధి మరియు అభివృద్ధి రంగాల్లో ముందుకు రావాలని సూచించారు. డాక్టర్ విజయశ్రీ PCPNDT Act గురించి వివరించి, గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దాసరి చంద్రశేఖర్, సూపర్వైజర్లు నాగమణి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళల్లో లింగ సమానత్వం మరియు బాలికల రక్షణపై అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :