Friday, 12 June 2026 01:44:30 AM

భీమిలిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా

Date : 14 April 2026 05:58 PM Views : 117

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 14:భీమునిపట్నం మూడవ వార్డు టీడీపీ అధ్యక్షుడు గొలగాని నరేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి కనకల అప్పలనాయుడు ఆధ్వర్యంలో భీమిలిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. డైట్ కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ ఆశయాలు, సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యతపై మాట్లాడారు. అనంతరం మాజీ కౌన్సిలర్ కుప్పిలి దుర్గ, కుప్పిలి వెంకటేష్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చురకల రమణ, అర్ధపాకల గుర్నాథరావు, పుక్కెళ్ల లక్ష్మీకుమారి, సంకుర భుక్త జోగారావు, కంచర్ల కామేష్, వాడమొదల సత్యారావు, సీరం మహేష్ రెడ్డి, వియ్యపు పోతురాజు, కాసరపు పెద్దల్లాజీ, అప్పికొండ అనంతకుమార్, గొలగాని వెంకట్రావు, కంటుభుక్త సునీత, వాసుపల్లి శ్రీహరి, గండిబోయిన పోలిరాజు, పైడిపల్లి నర్సింగరావు, నక్కెళ్ల వెంకట్రావు, కొండ్రు రామస్వామి, గాడు ఆనంద, పీతల వెంకట్రావు, పిల్ల తాతారావు, ఆవల సూరిబాబు, నడిగట్ల కృష్ణ, సాయి, సారిపిల్లి సురేష్, కండుబోతు శ్రీనివాసరావు, పిల్ల సత్యం, గుండాస్ అరవింద్, మాదాసు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :