Sunday, 27 September 2026 03:36:29 PM

తుది శ్వాస విడిచిన..102 ఏళ్ల దేశరాజు నిర్మలమ్మ

Date : 08 September 2026 11:35 AM Views : 307

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : సెప్టెంబరు 8: (అక్కయ్యపాలెం) 102 సంవత్సరాల పరిపూర్ణమైన జీవితం గడిపిన శ్రీమతి దేశరాజు నిర్మలమ్మ సెప్టెంబర్‌ 6న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల విశాఖ ఆరువేల నియ్యోగి బ్రాహ్మణ సంఘ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిర్మలమ్మగారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని సంఘం అధ్యక్షులు సుంకరణం సూర్యప్రతాప్, కార్యదర్శి ముళ్లపూడి కోటేశ్వరరావు, కోశాధికారి పిన్నం రాజు సత్యనారాయణతో పాటు సంఘ సభ్యులు నివాళులు అర్పించారు. దేశరాజు నిర్మలమ్మగారి అంత్యక్రియలు సెప్టెంబర్‌ 15న దశ దిన కర్మ, సెప్టెంబర్‌ 16న, వైకుంఠ సమారాధన మరియు ఆబ్దికం సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: