Sunday, 27 September 2026 03:36:08 PM

భీమిలి డైట్‌లో ఇంటిగ్రేటెడ్ ఆర్ట్ లెర్నింగ్ వర్క్‌షాప్

Date : 11 August 2026 06:48 PM Views : 166

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఆగష్టు 11: భీమిలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లో ఇంటిగ్రేటెడ్ ఆర్ట్ లెర్నింగ్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ బి.సునీత అధ్యక్షతన సోమవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సీతాపతి విద్యార్థినీ విద్యార్థులకు పలు బోధనా పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఒరిగామి పద్ధతిని ఉపయోగించి విద్యాబోధనను మరింత ఆసక్తికరంగా, సృజనాత్మకంగా మార్చే విధానాలను వివరించారు. అలాగే వీఏకే (విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్) విధానంలో బోధన చేయడం ద్వారా విద్యార్థులను పాఠ్యాంశాల పట్ల ఆకర్షితులను చేసే వివిధ పద్ధతులను వివరించారు. భీమిలి సాంస్కృతిక వేదిక సభ్యుడు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఎ.రాంప్రసాద్ మాట్లాడుతూ.. మనిషి జీవితంలో గురువు పాత్ర, ఉపాధ్యాయ వృత్తి విశిష్టతను వివరించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టనున్న డైట్ విద్యార్థినీ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన కార్యక్రమాన్ని భీమిలి సాంస్కృతిక వేదిక ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణ, సభ్యుడు ఆదిత్య ముమ్మిడిశెట్టి సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమంలో భీమిలి సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి మునుకుట్ల కోటయ్య, ముసునూరి సూర్య శ్రీనివాస్, కాళ్ల సన్నీ, అడిదం కిషోర్, వడలి శ్రీనివాస్, గౌరీనాయుడు, డైట్ అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: