Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : సెప్టెంబరు 14: భీమిలిలో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడిని భీమిలి పోలీసులు సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు తప్పిపోయినట్లు సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు, పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చిన్నారిని గుర్తించారు. అనంతరం బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చిన్నారిని సురక్షితంగా అప్పగించిన భీమిలి పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని భీమిలి సీఐ దివాకర్ యాదవ్ సూచించారు.
Admin
Neti Sakshyam